Court order-law (Credits: X)

Pune, Mar 7: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. (No Mangalsutra Or Bindi) ఇలా అయితే,  నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి (Pune Court) ఓ మహిళను ప్రశ్నించారు. మంగళసూత్రం ధరించని, బొట్టు పెట్టుకోని మహిళ పట్ల ఏ భర్త అయినా ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ సదరు న్యాయస్థానం మహిళను నిలదీసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. భర్త తనపై గృహ హింసకు పాల్పడినట్టు ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. ఆ దంపతులిద్దరూ కొద్ది రోజుల క్రితమే విడిపోయారు.

వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్‌

స్వయంగా జడ్జి ముందుకొచ్చి..

సదరు మహిళ చేసిన ఆరోపణలపై నడుస్తున్న కేసులో న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఇద్దరినీ కలిపేందుకు జడ్జి ప్రయత్నించారు. కోర్టుకు వచ్చిన భార్యను చూసిన జడ్జి.. ‘నీవు మంగళ సూత్రం ధరించలేదు. సింధూరం కూడా పెట్టుకోలేదు. పెండ్లయిన దానిలా ప్రవర్తించకుండా, వీటిని ధరించకుండా ఉంటే నీ భర్త నీ పట్ల ఎందుకు ఆసక్తి చూపాలి? అని జడ్జి ఆమెను ప్రశ్నించారు. సఖ్యతతోనే సంసారాలు నిలబడతాయని హితవు పలికారు. న్యాయవాది జహగిరిధర్‌ ఆ మహిళకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

కేపీహెచ్‌ బీలో యువతుల హల్‌ చల్‌.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్