IPL Auction 2025 Live

Telangana: బదిలీపై వేరే స్కూల్‌కు టీచర్,మేము కూడా మీతోనే అంటూ అదే పాఠశాలలో జాయిన్ అయిన 133 మంది విద్యార్థులు

అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు బదిలీపై వెళితే ఆయనతో పాటే స్కూలులో ఉన్న 133 మంది విద్యార్థులు వెళ్ళి ఆయన దగ్గరే జాయిన్ అయ్యారు.

Teacher transferred, 133 kids follow him to join new school

Jannaram, July 5: మనసుకు నచ్చిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే చాలా మంది విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు బదిలీపై వెళితే ఆయనతో పాటే స్కూలులో ఉన్న 133 మంది విద్యార్థులు వెళ్ళి ఆయన దగ్గరే జాయిన్ అయ్యారు.

అరుదైన ఘటన వివరాల్లోకెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్‌ 2012 జులై 13న చేరారు. అప్పుడు అక్కడ ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది.  స్కూలుకు తాగొచ్చిన టీచర్‌.. వెంటపడి మరీ చెప్పులు విసిరి బుద్ధిచెప్పిన స్టూడెంట్స్.. వీడియో ఇదిగో!

అయితే ఈ నెల 1న ఇదే మండలంలో మూడు కి.మీ. దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు ఆయన బదిలీ అయ్యారు. ఆయన బదిలీని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ఆ మాస్టారున్న పాఠశాలలోనే చేరతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు. దాంతో జూన్‌ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడెం పాఠశాల ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది. ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.