Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.

Death-Rep Image)

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్చరల్ టౌన్‌షిప్‌లో పవన్ ఇతర స్నేహితులతో కలిసి నాలుగేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన గుంటూరు జిల్లా వాసి.

ఈ కాలంలో పవన్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ పెరుగుతూ, ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని శారీరకంగా చేరువయ్యారు. అయితే ఇటీవల ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లుగా తెలుసుకున్న పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కోపంతో ఆ యువతి వ్యక్తిగత ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపించిన పవన్‌పై ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన

పోలీసులు ఆ కేసులో విచారణ ప్రారంభించడంతో, యువతి తననుంచి పూర్తిగా దూరమైంది. ఈ పరిణామాలతో భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయిన పవన్, సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకుని జీవితాన్ని ముగించాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఆ యువతిపైనా కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement