Telangana: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే జైలుకే, ఇప్పటికి 36 మందిని జైలుకు పంపిన సైబాబాద్ పోలీసులు, ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా

తాగి రోడ్ల మీదకు వచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా జైలుకు వెళ్లక తప్పదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు.

Cyberabad cp Stephen ravindra (Photo-Twitter)

Hyd, Dec 15: ఇక మందుబాబులు అలర్ట్ కావాల్సిందే.. తాగి రోడ్ల మీదకు వచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా జైలుకు వెళ్లక తప్పదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 11వరకు 396 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 321 మంది మందుబాబులు ఉండగా.. 74 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతున్న వారు ఉన్నారు.

ఇందులో 33 మంది నిందితులకు కోర్టు జైలు శిక్ష (33 motorists jailed for drunk driving) ఖరారు చేసింది. ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా (total fine of Rs 16.1 lakh was imposed on traffic violators) విధించినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మోటార్‌ వాహన చట్టం సెక్షన్‌– 19 ప్రకారం ఆయా నిందితుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ (ఆర్టీఓ) అధికారులకు సూచించారు.



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి