Telangana Assembly: జూలై 23న అసెంబ్లీ,24 నుండి మండలి సమావేశాలు ప్రారంభం, పార్టీ ఫిరాయింపు,నిరుద్యోగ సమస్యే ప్రధాన ఎజెండా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 24న మండలి సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

telangana assembly(Twitter0

Hyd, July 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 24న మండలి సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

జూలై 23న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. 25 లేదా 26వ తేదీల్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుందిప్ర‌భుత్వం. ఈసారి పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోండగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం వంటి బిల్లులను చర్చించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షలు జరిపారు. ప్రాధాన్యత రంగాలకు ఎక్కవు నిధులు కేటాయించే అవకాశం ఉంది.

ఇక ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తుంటి ఎముక విరగడంతో అసెంబ్లీకి హాజరుకాలేక పోయారు. అయితే ఈసారి పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రావాల్సిన పరిస్థితి నెలకొంది. కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్..ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న?

ఈ సమావేశాల్లో రేవంత్ సర్కార్‌ను కడిగిపారేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, పార్టీ ఫిరాయింపులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చకు పట్టుబడతామని ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నేతలను ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూనే ఈ 8 నెలల కాలంలో తాము ప్రజలకు ఏం చేశామో వివరించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement