BRS Public Meeting in Maharashtra: మహారాష్ట్రలో మిత్రపక్షానికే షాక్ ఇస్తున్న బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎన్సీపీ సీనియర్లు, ఈ నెల 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ

మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన భారీ బహిరంగ సభ (public meeting) ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి.

CM KCR (Photo-Video Grab)

Hyderabad, March 15: మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన భారీ బహిరంగ సభ (public meeting) ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను ఆకట్టుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. భారత ప్రజల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పడుతున్న తపన, ఆయన దార్శనికతను మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకువచ్చారు.

మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ ( భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సిఎం అశోక్ చౌహాన్ పై కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడి పోయారు). ఎన్సీపి నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపి నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు మంగళవారం హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

AP Cabinet Approves 15 Bills: 45 అజెండా అంశాలపై చర్చలు, 15 బిల్లులతో పాటు 2023-27 పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, 24 వరకు అసెంబ్లీ సమావేశాలు  

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, నాందేడ్ ఇంచార్జీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement