IPL Auction 2025 Live

Telangana Congress: తెలంగాణ పార్లమెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు 300కు పైగా అప్లికేష‌న్లు, ఖ‌మ్మం స్థానానికి భారీగా డిమాండ్, రిజ‌ర్వేష‌న్ స్థానాల్లోనూ పెద్ద ఎత్తున ఆశావాహులు

హనుమంతరావు (VH) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Congress (File Image)

Hyderabad, FEB 04: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం (Congress) దరఖాస్తుల గడువు ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతల నుంచి దరఖాస్తులు భారీగా వచ్చాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు (Telangana Congress) గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న‌ ఒక్కరోజే 160కి పైగా దరఖాస్తులు (Telangana Congress Applications) రావడం గమనార్హం. మొన్న‌టి వ‌ర‌కు మొత్తం కలిపి 140 దరఖాస్తులు వచ్చాయి. నిన్న‌ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు ఆశావహులు తరలిరావడంతో అక్కడ సందడి కనపడింది.

Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు 

ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdary), వి. హనుమంతరావు (VH) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. భువనగిరి టికెట్‌ కోసం చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, దయాకర్‌ దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీ కి పంపనుంది టీపీసీసీ. ఫిబ్రవరి రెండో వారంలో పరిశీలించి.. రేసు గుర్రాలను ఎంపిక చేయనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.