Telangana: జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో దారుణం, డెలివరీ సమయంలో మహిళ కడుపులో గుడ్డను వదిలేసిన డాక్టర్లు, 16 నెలల తర్వాత కడుపునొప్పితో ఘటన వెలుగులోకి..

జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేశారు. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు.

Operation (Photo credits: Wikimedia Commons)

Doctors Leaves Cloth in woman's Stomach: జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేశారు. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు. అయితే ఆపరేషన్ చేసి క్లాత్ మర్చిపోయారు. ఏడాది తర్వాత తీవ్ర కడుపునొప్పితో మహిళ ఆస్పత్రికి వచ్చింది. స్కానింగ్‌లో కడుపులో క్లాత్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి క్లాత్‌ను తొలగించారు.

చిన్నారిపై అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు, బంజారాహిల్స్‌ స్కూల్‌లో కిడ్‌పై తెగబడిన డ్రైవర్

జగిత్యాల జిల్లాకు చెందిన నవ్య 16 నెలల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. నిర్లక్ష్యంతో ఓ క్లాత్ ను ఆమె కడుపులోనే మరిచిపోయారు. వారం పాటు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నవ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. తిన్న అన్నం జీర్ణం కాక కడుపునొప్పితో రోజూ అవస్థ పడేది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు.

అత్తతో రోజంతా లాడ్జిలో అల్లుడు, మరుసటి రోజు అత్త అనుమానాస్పద మృతి, అల్లుడే గొంతు నులిమి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నవ్యను చూపించారు. కడుపునొప్పికి కారణం గుర్తించేందుకు వైద్యులు స్కానింగ్ చేయగా.. నవ్య కడుపులో ఓ క్లాత్ ఉన్నట్లు తేలింది. దీంతో మరోమారు నవ్యకు ఆపరేషన్ చేసి క్లాత్ ను బయటకు తీశారు. అయితే, ఈ క్లాత్ సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో ఉండే క్లాత్ కాదని, అది ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చిందని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతపెద్ద క్లాత్ ను నవ్య కడుపులో మరిచిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని విమర్శిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement