Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన

తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు.

Former Uppal MLA Bethi Subhas Reddy quits BRS, joins BJP

Hyd, April 18: తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కండువా కప్పుకున్నారు.  సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కి వాయిదా, వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం

ఇప్పటికే స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నగేందర్‌ ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార కాంగ్రెస్‌ కండువ కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్‌ను సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement