Supreme Court. (Photo Credits: PTI)

Hyd, April 18: ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరడంతో విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబా­బు­ను నిందితునిగా చేయాలని, దర్యాప్తు సీబీ­ఐకి అప్పగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వే­ర్వే­రు పిటిషన్లను దాఖలు చేశారు.

ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని.. ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర కోర్టును కోరారు.  ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ

తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపి చాలా వాయిదాలు కోరారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు.తాజాగా మరోసారి వాయిదా పడింది.

కాగా చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును ఏసీబీ 22 సార్లు ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నిర్ధారించినట్లు సమాచారం.