KCR Discharged from Yashoda Hospital: యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేంత వరకు నందినగర్‌లో విశ్రాంతి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.

KCR Discharged from Yashoda Hospital (Photo-X)

Hyd, Dec 15: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.

నన్ను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ వీడియో విడుదల చేసిన కేసీఆర్, నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని వెల్లడి

ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, నాగార్జున తదితరులు పరామర్శించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement