Telangana: మంత్రాలు చేస్తున్నారంటూ..తండ్రి, ఇద్దరు కొడుకులను కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు, జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తెలంగాణలో జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య (Man, two sons murdered in Jagtial) చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు (unidentified persons) దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

Representational Image (Photo Credits: Pixabay)

Jagtial, Jan 20: తెలంగాణలో జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య (Man, two sons murdered in Jagtial) చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు (unidentified persons) దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. కుల సంఘం సమావేశం జరుగుతుండగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రాల నేపంతో ఈ ముగ్గురిని హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ ప్రకాష్, సీఐ కృష్ణకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే హత్యకు గురైన ముగ్గురు మంత్రాలతో స్థానికులను అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తులపై ప్రత్యర్థులు దాడి చేసి చంపేశారని చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement