Telangana Shocker: కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి చివరకు ప్రియుడితో కలిసి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Representative Image (File Image)

Hyd, May 23: వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి చివరకు ప్రియుడితో కలిసి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు.

ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన

పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు.ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు .



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif