Telangana Shocker: నన్ను ప్రేమిస్తావా లేక ఈ పురుగు మందు తాగి చస్తావా, రాజన్న జిల్లాలో యువతిని బెదిరించిన యువకుడు, పురుగుల మందు తాగి మృతి చెందని యువతి

రాజన్నసిరిసిల్ల జిల్లా తడగొండలో విషాదం చోటు చేసుకుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుల మందు (consuming pesticide) తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో ( Young man Harassment) ఓ ఇంటర్‌ విద్యార్థిని క్రిమిసంహారకమందు తాగింది. చికిత్స పొందుతూ ప్రాణాలు (college girl kills self) కోల్పోయింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyd, Dec 28: రాజన్నసిరిసిల్ల జిల్లా తడగొండలో విషాదం చోటు చేసుకుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుల మందు (consuming pesticide) తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో ( Young man Harassment) ఓ ఇంటర్‌ విద్యార్థిని క్రిమిసంహారకమందు తాగింది. చికిత్స పొందుతూ ప్రాణాలు (college girl kills self) కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది.

 పిల్లలు పుట్టడం లేదని భార్య ప్రైవేట్‌ పార్టులను బ్లేడ్‌తో కోసిన వ్యక్తి, దాడికి ముందు అసహజ శృంగారానికి పాల్పడ్డ కిరాతకుడు, అంతర్గత రక్తస్రావంతో చావుబతుకుల మధ్య మహిళ

అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్‌ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే ఈ పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరించాడు.

వీడియో, పాతబస్తీలో యువకులు ర్యాష్ డ్రైవింగ్,గన్ చూపించి వారికి చుక్కలు చూపించిన మీర్‌చౌక్‌ ఎస్సై, కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించిన యువకులు

సతీశ్‌ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్‌ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement