Telangana Shocker: వీడు మనిషేనా, భార్యను గొడ్డలితో మెడపై నరికి, 3 నెలల పసికందును నీటి సంపులో పడేసిన భర్త, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన బ‌ట్ట‌ల‌తోనే ప‌రార్

ఓ కసాయి భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి (Woman brutally killed by husband), 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు.

Murder (Photo Credits: Pixabay)

Anajpur, Mar 15: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి (Woman brutally killed by husband), 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు. అబ్దుల్లాపూర్‌మెట్ ప‌రిధిలోని అనాజ్‌పూర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్ పూర్ కి చెందిన ధనరాజ్‌తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బాలింతగా ఉన్న లావణ్య(23)ను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్‌ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడిన ధనరాజ్‌ ఆమెను గొడ్డలితో నరికాడు.

హర్యానాలో దారుణం, పెళ్లి చేయలేదని తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కొడుకు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

మెడ‌కు తీవ్ర గాయం కావ‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది.ఆ తర్వాత 3 నెలల కుమారుడిని సంపులో పడేసి హతమార్చాడు. భార్య‌, కుమారుడిని చంపిన ధ‌న్‌రాజ్ అంద‌రూ చూస్తుండ‌గానే, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన బ‌ట్ట‌ల‌తోనే ప‌రారైయ్యాడు.

అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు

తల్లితో గొడవకు దిగిన తండ్రిని చూసి భయపడిన మూడేళ్ల కుమార్తె ఆద్య ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే ధనరాజ్‌ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన