TGSRTC Dussehra Special Buses: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. 7,000 స్పెషల్ బస్సులు రెడీ చేసిన టీజీఎస్ఆర్టీసీ.. పూర్తి వివరాలు ఇవే..
తెలుగువారి అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకల రద్దీని నియంత్రించేందుకు మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది.
TGSRTC Dussehra Special Buses: తెలుగువారి అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకల రద్దీని నియంత్రించేందుకు మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీదేవి అధికారికంగా వెల్లడించారు.
పండుగ వేళ కస్టమర్ల రద్దీ అత్యధికంగా ఉండే కీలక రోజులలో ప్రత్యేక సర్వీసులలో మాత్రమే ఛార్జీలను 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 9, 10, 16 , 17 తేదీల్లో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే సర్వీసులకు, అలాగే పండుగ ముగిసాక తిరుగు ప్రయాణాల రద్దీ ఉండే అక్టోబర్ 25, 26 తేదీల్లో ఈ సవరించిన ప్రత్యేక ఛార్జీలు అమల్లో ఉంటాయి. అయితే నిత్యం నడిచే సాధారణ షెడ్యూల్డ్ బస్సుల ఛార్జీల్లో ఎలాంటి పెంపూ ఉండదని, పాత ధరలే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అన్ని రకాల బస్సుల్లోనూ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో భూగర్భ జలాల సంక్షోభం.. 33 జిల్లాల్లో అడుగంటిన నీటి మట్టాలపై ఆందోళన.. తాజా నివేదికలో సంచలన విషయాలు..
ఈ భారీ రవాణా ప్రణాళికలో భాగంగా కేటాయించిన 7 వేల ప్రత్యేక బస్సులలో అత్యధికంగా కరీంనగర్ జోన్కు 3,533 సర్వీసులను కేటాయించారు. దీనితో పాటు హైదరాబాద్ జోన్కు 2,155 బస్సులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్కు 1,312 బస్సులు నడపనున్నారు. జిల్లా వారీగా పరిశీలిస్తే నల్గొండకు 815, మహబూబ్నగర్కు 645, రంగారెడ్డి రీజియన్కు 440, అలాగే మెదక్ ప్రాంతానికి 255 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల నుంచి అత్యధిక రద్దీ ఉండే అక్టోబర్ 16న 1,354 బస్సులు, అక్టోబర్ 17న 1,211 బస్సులు తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రధాన పట్టణాలకు బయలుదేరనున్నాయి.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి వంటి ప్రధాన పాయింట్ల వద్ద ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రయాణికులు ఎండ, వర్షాల నుంచి తలదాచుకునేందుకు పందిళ్లు, తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లతో పాటు రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమించారు. పండుగ రోజుల్లో ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు, గందరగోళం తలెత్తకుండా ప్రయాణికులు ముందస్తుగానే ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.