Tollywood Actress Died: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో టాలివుడ్ నటి మృతి, శోక సంద్రంలో తెలుగు సినీ పరిశ్రమ, కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి సురేఖ వాణి..

ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం.

Road accident (image use for representational)
Hyd, March 19: శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూ ట్యూబర్, సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్, నటి డాలీ అలియాస్ గాయత్రి మృతి చెందింది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు. "డాలీ ఇది చాలా అన్యాయం. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. అసలు మాటలు రావట్లేదు. టోటల్లీ బ్లాంక్" అని పోస్ట్ చేశారు. గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో నటి డాలీ చనిపోయిందని తెలిసిన వారు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
డాలీ అసలు పేరు గాయత్రి. తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న డాలీ  నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం. మద్యంసేవించి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు

ఈ ప్రమాదంలో ఎల్లా హోటల్ లో పనిచేస్తున్న మహేశ్వరి అనే మరో మహిళ కూడా మృతి చెందింది. నిన్న హోలీ పండగ సందర్భంగా గాయత్రి, రోహిత్ లు ప్రిసంపబ్ లో పార్టీ చేసుకుని, ఇంటిరి తిరుగుపయనమైన సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Trisha Emotional Post: నా కొడుకు చ‌నిపోయాడు! న‌టి త్రిష ఎమోష‌న‌ల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.