TS New Secretariat: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్నిచేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) హైకోర్టులో విజయం సాధించింది. సచివాలయం కూల్చివేతకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తెలంగాణ సచివాలయం (TS Secretariat) కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు (TS High Court) ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి (TS New Secretariat) అనుమతి ఇచ్చింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, June 29: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) హైకోర్టులో విజయం సాధించింది. సచివాలయం కూల్చివేతకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తెలంగాణ సచివాలయం (TS Secretariat) కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు (TS High Court) ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి (TS New Secretariat) అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మరో 983 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 14 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించిన సీఎం

కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

కాగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టాలని ప్రభుత్వం భావించింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చివరకు మార్చి 10న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై హైకోర్టు ఈరోజు తుది తీర్పును వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement