COVID in TS: తెలంగాణలో మరో 983 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 14 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించిన సీఎం
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, June 29:  తెలంగాణలో కోవిడ్ ప్రతాపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 14,419 కు చేరుకుంది.

హైదరాబాద్ లో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. నిన్న నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ నుంచే 816 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది.

నిన్న రంగారెడ్డి జిల్లా నుంచి 47, మేడ్చల్ నుంచి 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మంచిర్యాల జిల్లా నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా 33 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కోవిడ్19 విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో వరంగల్ రూరల్ నుంచి 19, వరంగల్ అర్బన్ నుంచి 12 కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Update:

Status of positive cases of #COVID19 in Telangana

 

నిన్న మరో నలుగురు కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 247 కు పెరిగింది.

ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో మరో 244 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,172 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,000 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 82,458 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.