Hyderabad Girl Died in London: లండన్‌లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన బ్రెజిల్‌ యువకుడు, మరో తెలుగు యువతికి తీవ్ర గాయాలు

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో తెలంగాణకు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని రెడ్డి లండన్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా..వారిలో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది.

Hyderabad Girl Died in London (Photo-Video Grab)

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో తెలంగాణకు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని రెడ్డి లండన్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా..వారిలో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో తెలుగు యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంగ్లాండ్‌లో హైదరాబాద్‌ యువతి మృతి, సరదాకోసం బీచ్‌కు వెళ్లి అలల్లో చిక్కుకున్న సాయితేజస్వీ రెడ్డి, మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు యత్నాలు

కాగా తండ్రి అనారోగ్యానికి గురవ్వగా ఆరు నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్లింది. మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి చేసి ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తన కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తేజస్వినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement