Telangana: తెలంగాణలో మరో యువతి కిడ్నాప్, గుడికి వెళ్లిన యువతిని కారులో కిడ్నాప్ చేసిన నలుగురు అగంతకులు, తండ్రిని కొట్టి అతని ముందే ఎత్తుకెళ్లిన వైనం, రాజన్న సిరిజిల్లాలో ఘటన
రాజన్న జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో తండ్రి ముందే యువతి కిడ్నాప్ ఘటన (kidnapped an 18-year-old girl) కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి జిల్లాలోని (Rajanna Sircilla district) హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు.
Hyd, Dec 20: రాజన్న జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో తండ్రి ముందే యువతి కిడ్నాప్ ఘటన (kidnapped an 18-year-old girl) కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి జిల్లాలోని (Rajanna Sircilla district) హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇదిలా ఉంటే శాలినికి సోమవారమే ఎంగేజ్‌మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. యువతి మైనర్గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు.
Here's Video
అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు.