Meta Trial: మెటాలో రక్షణ లేదు.. నా కూతురుకే పురుషాంగం ఫోటోలు పంపారు.. మెటా మాజీ ఇంజినీర్ ఆర్టురో బెజార్ సంచలన వ్యాఖ్యలు..

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్' (Meta) కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు యువత , పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయంటూ దాఖలైన చారిత్రాత్మక కేసు విచారణలో మైండ్ బ్లాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Ex-Meta Safety Engineer Reveals How His 14-Year-Old Daughter Was Targeted On Instagram (Photo Credits: Wikimedia Commons)

Meta Trial: సోషల్ మీడియా దిగ్గజం 'మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్' (Meta) కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు యువత , పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయంటూ దాఖలైన చారిత్రాత్మక కేసు విచారణలో మైండ్ బ్లాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్ ఫెడరల్ కోర్టులో మంగళ, బుధవారాల్లో జరిగిన ఈ విచారణలో, మెటా మాజీ భద్రతా ఇంజనీర్, ఇన్‌స్టాగ్రామ్ కన్సల్టెంట్ ఆర్టురో బెజార్ (Arturo Bejar) సంస్థ తీరును ఎండగడుతూ కీలక సాక్ష్యం ఇచ్చారు.

ఫేస్‌బుక్‌లో దాదాపు ఆరు సంవత్సరాల పాటు వినియోగదారుల, ముఖ్యంగా పిల్లల భద్రతకు సంబంధించిన టూల్స్ అభివృద్ధి చేసే విభాగంలో బెజార్ పనిచేశారు. అయితే, తన 14 ఏళ్ల కుమార్తె సొంతంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచే వరకు ఈ ప్లాట్‌ఫామ్‌లలో చిన్నపిల్లలు ఎలాంటి అసభ్యకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తనకు అర్థం కాలేదని ఆయన జ్యూరీకి వివరించారు.

ఏఐతో కొత్త వైరస్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి..

నా కుమార్తెకు తెలియని వ్యక్తుల నుంచి లైంగిక అభ్యర్థనలు, అసభ్యకరంగా ఉన్న మర్మాంగాల ఫోటోలు రావడం మొదలైంది. ఒక తండ్రిగా , భద్రతా ఇంజనీర్‌గా అది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది," అని బెజార్ వాపోయారు. ఈ ఘటన తర్వాతే ఆయన 2019లో మెటా 'వెల్-బీయింగ్' బృందంలో కాంట్రాక్టర్‌గా చేరి, ప్లాట్‌ఫామ్‌లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే యాజమాన్యం సరైన మద్దతు ఇవ్వకపోవడంతో 2021లో శాశ్వతంగా వైదొలిగి, బహిరంగంగా నిజాలు చెప్పే విజిల్‌బ్లోయర్‌గా మారారు.

కంపెనీలో పని చేస్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌ల వల్ల టీనేజర్లకు "గణనీయమైన హాని" జరుగుతోందని అంతర్గత పరిశోధనల ద్వారా ఎగ్జిక్యూటివ్‌లకు స్పష్టంగా తెలుసని బెజార్ ఆరోపించారు. ముఖ్యంగా శరీరాకృతి, మానసిక సమస్యలతో బాధపడే టీనేజ్ అమ్మాయిలపై ఇన్‌స్టాగ్రామ్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిసినా.. లాభాలు, యూజర్ల సంఖ్య తగ్గకూడదనే ఉద్దేశంతో మార్పులను అడ్డుకున్నారని తెలిపారు.

సాక్ష్యమిచ్చే సమయంలో బెజార్ మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత అధిక స్థాయిలో లైంగిక వేధింపులు, హానిని ఎదుర్కొంటున్నారు. కానీ వారికి అవసరమైన రక్షణ, మద్దతు లేదా పరిహారం కంపెనీ నుంచి లభించడం లేదని స్పష్టం చేశారు.

విచారణ సందర్భంగా మెటా తరఫు న్యాయవాది బ్రియాన్ స్టెక్లాఫ్, బెజార్‌ను తీవ్రంగా ప్రశ్నించారు. కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్న సమయంలోనే ఈ భద్రతా సమస్యలను ఎందుకు పూర్తిగా పరిష్కరించలేకపోయారని నిలదీశారు. దీనికి బెజార్ సమాధానమిస్తూ.. ప్లాట్‌ఫామ్‌లో హాని అనేది సున్నాకు చేరడానికి అది ఒక గమిత సమీకరణం కాదు, రక్షణ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ" అని వ్యాఖ్యానించారు.

అలాగే, 16 ఏళ్ల వయసులో తన కుమార్తె పబ్లిక్ ప్రొఫైల్ ద్వారా కార్ల గురించి పోస్ట్ చేయడానికి ఎలా అనుమతించారని న్యాయవాది ప్రశ్నించగా.. సోషల్ మీడియా ద్వారా వచ్చే వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తన కుమార్తెకు నేర్పించడం ఒక తండ్రిగా తన బాధ్యత అని, అంతమాత్రాన కంపెనీ తన బాధ్యత నుండి తప్పుకోలేదని బెజార్ ఘాటుగా బదులిచ్చారు.

ఈ చారిత్రాత్మక దాటాని కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూటమి దాఖలు చేసింది. 13 ఏళ్లలోపు పిల్లల డేటాను చట్టవిరుద్ధంగా సేకరించడం, యువతను ఈ యాప్‌లకు బానిసలుగా మార్చేలా అడిక్టివ్ అల్గారిథమ్స్ డిజైన్ చేయడం ద్వారా ఫెడరల్ గోప్యతా చట్టాలను మెటా ఉల్లంఘించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఏకంగా 193 బిలియన్ డాలర్ల నుండి 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్లాట్‌ఫామ్‌లను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని కోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్న మెటా, పిల్లల భద్రతకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా త్వరలోనే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సెరిలు కూడా సాక్షుల బోనులో నిలబడనుండటంతో ఈ విచారణ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement