Mark Zuckerberg (Photo Credits: X/@BRICSinfo)

New Delhi, Jan 15: గతేడాది భార‌తీయ ఎన్నిక‌ల‌పై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్(Mark Zuckerberg) త‌ర‌పున మెటా ఇండియా సంస్థ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కరోనా స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వాలు కూలిపోయిన‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల కామెంట్ చేశారు. ఆ దేశాల్లో భార‌త్ కూడా ఉన్న‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ పేర్కొన్నారు.పార్లమెంటరీ కమిటీ ఆయనకు సమన్లు పంపేందుకు సిద్ధపడటంతో 'మెటా ఇండియా' (Meta India) స్పందించి భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసింది. పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది.

మెటా ఇండియా ప‌బ్లిక్ పాల‌సీ వైస్ ప్రెసిడెంట్ శివ‌నాథ్ తూక్ర‌ల్ త‌న ఎక్స్ అకౌంట్‌లో జుక‌ర్‌బ‌ర్గ్ త‌ర‌పున క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఆ సారీ పోస్టును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ట్యాగ్ చేశారు.కోవిడ్ త‌ర్వాత అనేక దేశాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార పార్టీలు ఓట‌మి చ‌విచూశాయ‌న్న విష‌యం అనేక దేశాల్లో నిజ‌మైంద‌ని, కానీ ఇండియా విష‌యంలో అది నిజం కాలేద‌న్నారు. ఆ త‌ప్పు ప‌ట్ల తాము క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు వెల్లడించారు. మెటా సంస్థ‌కు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని పేర్కొన్నారు. దేశ సృజనాత్మక భవిష్యత్తులో కీలక తాము కీలక పాత్ర పోషించేందుకు తాము ఎదురుచూస్తున్నామని కూడా పేర్కొన్నారు.

3,600 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జుకర్ బర్గ్, 2025 ఆరంభంలోనే ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం మెటా

మ‌రో వైపు మెటా సంస్థ‌కు స‌మ్మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ చైర్మ‌న్ నిశికాంత్ దూబే తెలిపారు. మహమ్మారి త‌ర్వాత సుమారు 20 దేశాల్లో ఆయా పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. కానీ ఇండియాలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు.

జకర్ బర్గ్ ఏమన్నారంటే..

2024 అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా నిలిచిందని, భారత్ సహా అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్‌బర్గ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం, కోవిడ్, ఆర్థిక విధానాల ప్రభావం ఇందుకు కారణం కావచ్చని అన్నారు.దీనిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా ఖండించారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసిందని,మోదీ నిర్ణయాలు మూడోసారి ఆయన విజయానికి నిదర్శనంగా నిలిచాయని చెప్పారు.