Jio Recharge Plans: రూ. 100 లోపే ఆకట్టుకునే జియో ప్లాన్లు ఇవిగో.. ఓటీటీ, లైవ్ టీవీ ప్రియుల కోసం సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లు..

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల వినోద అవసరాలకు అనుగుణంగా సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది

Representational image (photo credit- ANI)

Jio Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల వినోద అవసరాలకు అనుగుణంగా సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 100 కంటే తక్కువ బడ్జెట్‌లో వినోదాన్ని కోరుకునే చందాదారుల కోసం రూ. 55 , రూ. 77 ధరలతో రెండు ఆకట్టుకునే ప్లాన్లను అందిస్తోంది. ఓటీటీ , లైవ్ టీవీ సబ్‌స్క్రిప్షన్లు కోరుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.   కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. రూ.2,000 దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి.. పూర్తి వివరాలు ఇవిగో..

రూ. 55 లైవ్ టీవీ ప్లాన్ వివరాలు: తక్కువ ఖర్చుతో మొబైల్‌లో ప్రసారాలను వీక్షించాలనుకునే వారి కోసం జియో రూ. 55 ప్రత్యేక టీవీ వోచర్‌ను రూపొందించింది.

వ్యాలిడిటీ & డేటా: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో 10 MB డేటా మాత్రమే లభిస్తుంది.

ప్రయోజనాలు: జియోటీవీ (JioTV) యాప్‌లో 1,000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ సబ్ హెచ్‌డీ వంటి ప్రీమియం ఛానళ్లను చూడవచ్చు (అయితే జియోస్టార్ స్పోర్ట్స్ ఛానళ్లు ఇందులో ఉండవు).

గమనిక: ఇది యాడ్-ఆన్ వోచర్ మాత్రమే. దీనిని ఉపయోగించడానికి ఖాతాలో ఏదైనా ఒక బేస్ రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి.

రూ. 77 ఓటీటీ ప్లాన్ వివరాలు:  ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది.

వ్యాలిడిటీ & డేటా: ఈ ప్లాన్ ద్వారా 5 రోజుల వ్యాలిడిటీతో 3 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

ఓటీటీ ప్రయోజనం: ఈ రీఛార్జ్‌తో 30 రోజుల పాటు ఉచితంగా సోనీలివ్ (SonyLIV) ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా సోనీలివ్ కంటెంట్‌ను సులభంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

డిజిటల్ వినోదాన్ని తక్కువ ధరకు పొందాలనుకునే జియో చందాదారులకు ఈ రెండు ప్లాన్లు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement