Aditya L1: జయహో ఇస్రో.. ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం విజయవంతం.. వీడియోతో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై కూడా విజయబావుటా ఎగురవేసింది.

Credits: X

Newdelhi, Sep 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై కూడా విజయబావుటా ఎగురవేసింది. సూర్యుడిపై (Sun) అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1(Aditya L1)ను సక్సెస్ అయింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ఆదిత్య-ఎల్‌1ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కి.మీ. దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి.

Aditya L1 LIVE: ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం లైవ్ వీడియో ఇదిగో.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే ప్రయోగం లక్ష్యం

ఇదే మొదటి శాటిలైట్

సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే కావడం విశేషం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement