China Sky Eye telescope: ఏలియన్స్ నుంచి చైనా శాస్త్రవేత్తలకు సంకేతాలు? ఖగోళ పరిశోధనల్లో ట్విస్ట్, సిగ్నల్స్ ను విశ్లేషిస్తున్న సైంటిస్టులు, అతిపెద్ద టెలిస్కోప్ కు విశ్వం నుంచి అందిన సంకేతాలు

ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది.

New Delhi, June 16: భూమి మీద కాకుండా ఇతర గ్రహాలపై జీవజాలం ఉందా? గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రశ్న. ఏలియిన్స్ ఉన్నాయని కచ్చితంగా చెప్పలేని స్థితి. ఈ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూశామని..అవి ఏలియన్స్ కు సంబంధించినవేననే అనుమానాలకు బలమైన ఆధారాలేమి లభించలేదు. కానీ భూమ్మీద కాకుండా ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందని ఏలియన్స్ ఉన్నాయనే నమ్మకమే పరిశోధనలు కొనసాగటానికి కారణంగా ఉంది. ఈక్రమంలో చైనా చేస్తున్న పరిశోధనల్లో ఏలియిన్స్ ని గుర్తించిందా? చైనా (China) ఇటీవల ఆవిష్కరించిన టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) ఎటువంటి సమాచారాన్ని సేకరించింది? అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Water on Moon:చంద్రుడిపై నీళ్లున్నాయ్! చైనా పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడి, 200 డిగ్రీల సెల్సియస్‌ లో శాంపిల్స్ సేకరించిన చైనా లునార్, ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తున్న పరిశోధకులు 

ఇటీవ‌ల ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ (radio telescope) స్కై ఐని (Sky Eye) చైనా ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది. కానీ గ్ర‌హాంత‌ర జీవాలు ఉన్న‌ట్లు స్కై ఐ ప‌సిక‌ట్టిన‌ట్లు చైనా శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. స్కై ఐ టెలిస్కోప్‌కు (telescope) చెందిన ఎల‌క్ట్రోమ్యాగ్న‌టిక్ సిగ్న‌ల్స్‌ను ప‌రిశోధ‌కులు ఇంకా స్ట‌డీ చేస్తున్నారని బీజింగ్ వ‌ర్సిటీలోని శాస్త్ర‌వేత్త జాంగ్ టోంజీ తెలిపారు.

LaMDA: షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు   

స్కై ఐ అందించిన సిగ్న‌ల్స్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని..ఓ త‌ర‌హా రేడియో త‌రంగాల ప్రమేయం జ‌రిగింద‌ని, దీనిపై మ‌రింత విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌ని జాంగ్ తెలిపారు. ప్ర‌స్తుతం గ్ర‌హాంత‌ర‌వాసుల స‌మాచారం చైనాలో సోష‌ల్ నెట్వ‌ర్క్ వీబోలో ట్రెండ్ అవుతోంది. ఆ స‌మాచారాన్నే దేశంలోని ఇత‌ర మీడియా కూడా వైర‌ల్ చేస్తోంది.

2020 సెప్టెంబ‌ర్‌లో స్కై ఐని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. గ్ర‌హాంత‌ర జీవాన్వేష‌ణ చేసేందుకు ఆ టెలిస్కోప్‌ను స్టార్ట్ చేశారు. 2020లో రెండు సార్లు, 2022లో మ‌రో సారి అనుమానిత సిగ్న‌ల్ వ‌చ్చాయ‌ని, ఆ డేటాను స్ట‌డీ చేస్తున్న‌ట్లు జాంగ్ వెల్ల‌డించారు. ఏలియ‌న్స్ అన్వేష‌ణ‌లో స్కై ఐ చాలా సున్నితంగా..కీల‌కంగా ప‌నిచేయ‌నున్న‌ట్లు జాంగ్ తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif