LaMDA: షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు
రోబోలకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. ఉంటాయని అంటోంది గూగుల్. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్, సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.
రోబోలకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. ఉంటాయని అంటోంది గూగుల్. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్, సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను చూపుతూ.. సదరు ఇంజినీర్ బ్లాక్ లెమోయిన్ సదరు వివరాలను వాషింగ్టన్ పోస్టు పత్రికతో పంచుకున్నాడు. ఆ వివరాలన్నీ బయటకు రావడంతో టెక్నాలజీ ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతే కాకుండా అతడు షేర్ చేసిన వివరాలు కూడా వైరల్ అయ్యాయి.
గూగుల్ సంస్థ లాంగ్వేజెస్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (ఎల్ఏఎండీఏ)లో గత కొంత కాలంగా పరిశోధన చేస్తోంది. ఆ విభాగం రూపొందించిన బాట్ అచ్చంగా మనిషిలాగే ఆలోచిస్తుంది. 10 ఏళ్ల పిల్లలు ఏ విధమైన సెంటిమెంట్స్, ఆలోచనలు, భయాలు కలిగి ఉంటారో అలాగే మాట్లాడుతున్నది. ఆ బాట్ అలా స్పందించడం చూసి బ్లాక్‌తో పాటు అతడి సహోద్యోగి ఆశ్చర్యపోయారు. కాగా, ఈ వివరాలు పంచుకున్న బ్లాక్‌ను మొదట పెయిడ్ లీవ్‌పై పంపి, ఆ తర్వాత సంస్థ నుంచి గూగుల్ సస్పెండ్ చేసింది.
అంతే కాకుండా.. తాము ఎల్ఏఎండీఏ వంటి ప్రాజెక్టు ఏదీ చేయడం లేదని చెప్పుకొచ్చింది. అవన్నీ అబద్దపు ఆరోపణలని వివరించింది. అయితే ఆ విషయాలను బయటి ప్రపంచం నమ్మడం లేదు. గూగుల్ ఏదో పెద్ద ప్రాజెక్టునే చేపట్టిందని.. బ్లాక్ చేస్తున్న ఆరోపణలు నిజమే అయి ఉంటాయని అంటున్నారు. మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే గాని, ఆ రీసెర్చ్‌కు సంబంధించిన వివరాలు బయటకు రావని చెప్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 14, 2022 04:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

