Rohan Naidu: ఇంజినీరింగ్‌ను 18 ఏళ్లకే వదిలేశాడు.. ఇప్పుడు విశ్వంలోని తొలి బ్లాక్‌హోల్స్ రహస్యాలను ఛేదిస్తున్నాడు..

రోహన్ పి. నాయుడు హైదరాబాద్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టి సింగపూర్‌లోని Yale-NUS Collegeలో చేరారు. అనంతరం Harvardలో Astronomyలో PhD పూర్తి చేసి, MITలో పరిశోధనలు చేశారు. తాజాగా ఆయన నేతృత్వంలోని బృందం James Webb Space Telescope డేటాతో సుమారు బిగ్ బ్యాంగ్ తర్వాత 660 మిలియన్ సంవత్సరాల నాటి అసాధారణ వస్తువును అధ్యయనం చేసింది.

MIT Astronomer Rohan Naidu Leads Discovery of Possible 'Black Hole Star' in the Early Universe (Photo Credits: X)

విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత పురాతన రహస్యాలను ఛేదించడంలో హైదరాబాద్‌కు చెందిన యువ ఖగోళ శాస్త్రవేత్త ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక 'మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (MIT) పప్పలార్డో ఫెలోగా విధులు నిర్వర్తిస్తున్న రోహన్ పి. నాయుడు నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం, బిగ్ బ్యాంగ్ సంభవించిన కేవలం 660 మిలియన్ సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన మరియు విచిత్రమైన కృష్ణబిలాన్ని (Black Hole) కనుగొంది. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రసిద్ధ అంతర్జాతీయ విజ్ఞాన పత్రిక నేచర్' (Nature) లో 'విశ్వ ఉదయకాలంలో వాయువుతో కప్పబడిన కృష్ణబిలం' పేరుతో అధికారికంగా ప్రచురితమయ్యాయి.

నాసాకు చెందిన 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్' (JWST) సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన రోహన్ నాయుడు బృందం, MoM-BH-1 అనే అసాధారణమైన అత్యంత ఎరుపు రంగు ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. ఇది సాధారణ నక్షత్రాల కూటమి (గెలాక్సీ) కాదని, ధూళి రహిత అత్యంత దట్టమైన, అల్లకల్లోలమైన హైడ్రోజన్ వాయు పొరతో చుట్టుముట్టబడిన ఒక 'సూపర్ మాసివ్ బ్లాక్ హోల్' అని శాస్త్రవేత్తలు నమూనా రూపంలో నిరూపించారు.

ఏఐతో కొత్త వైరస్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి..

విశ్వం ఆరంభంలోనే కొన్ని కృష్ణబిలాలు అంత వేగంగా బిలియన్ల సౌర ద్రవ్యరాశికి ఎలా పెరగగలిగాయో అర్థం చేసుకోవడానికి ఈ 'దట్టమైన వాయు పొర' ఆవరణ సూత్రం సరికొత్త మార్గాన్ని చూపిస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కనిపించే మర్మమైన లిటిల్ రెడ్ డాట్స్ (Little Red Dots) కి సంబంధించిన వివరణను అందించడంలో ఈ పరిశోధన కీలక మైలురాయిగా నిలవనుంది.

హైదరాబాద్‌లోనే పెరిగిన రోహన్ నాయుడు ప్రయాణం ఎంతో అసాధారణమైనది. 18 ఏళ్ల వయసులోనే ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి, ఖగోళ భౌతిక శాస్త్రం (Astrophysics) వైపు అడుగులు వేశారు. సింగపూర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు.

ప్రస్తుతం విశ్వానికి చెందిన తొలి గెలాక్సీలపై ఎంఐటీలో పరిశోధనలు చేస్తున్న రోహన్ నాయుడు, ఖగోళ శాస్త్రంతో పాటు కవిత్వం, టెస్ట్ క్రికెట్ పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. హైదరాబాదీ శాస్త్రవేత్త సాధించిన ఈ అరుదైన మైలురాయి పట్ల అంతర్జాతీయ సైన్స్ సమాజంలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

రోహన్ పి. నాయుడు హైదరాబాద్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టి సింగపూర్‌లోని Yale-NUS Collegeలో చేరారు. అనంతరం Harvardలో Astronomyలో PhD పూర్తి చేసి, MITలో పరిశోధనలు చేశారు. తాజాగా ఆయన నేతృత్వంలోని బృందం James Webb Space Telescope డేటాతో సుమారు బిగ్ బ్యాంగ్ తర్వాత 660 మిలియన్ సంవత్సరాల నాటి అసాధారణ వస్తువును అధ్యయనం చేసింది. దీనిని ‘black hole star’గా భావించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement