Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది.
Newyork, Feb 18: ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు (Plane Accidents) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్ కు (Delta Airlines) చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం తలకిందులుగా తిరగబడింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బలమైన గాలులే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు, విమానం తిరగబడే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి పలువురిని గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
Here's Video:
అమెరికాలో మూడు వారాల్లో నాలుగు ప్రమాదాలు
కెనడాపొరుగుదేశం అమెరికాలోనూ ఇటీవల వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన మూడు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు. రెండు రోజుల తర్వాత (జనవరి 31న) ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 11న రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పి ఒకరు మరణించారు. గత మూడు వారాల్లో అమెరికాలో నాలుగు విమాన ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది చనిపోయారు.