Italy Horror: పోర్న్ స్టార్ దారుణ హత్య, అనంతరం ఆ మృతదేహాన్ని కాల్చి, ముక్కలుగా నరికి రోడ్డు పక్కన పారేసిన బ్యాంక్ ఉద్యోగి, ఇటలీలో భయాకన ఘటన

ఇటలీలో హర్రర్ చోటు (Italy Horror) చేసుకుంది. పోర్న్‌ నటిని ఒక బ్యాంకు ఉద్యోగి దారుణంగా హత్య (Banker kills adult actress) చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి ముక్కలుగా నరికి చిన్న సంచుల్లో రోడ్డు పక్కన (chops off her body and dumps it on roadside) పడేశాడు.

Representational Image | (Photo Credits: IANS)

Italy, Mar 31: ఇటలీలో హర్రర్ చోటు (Italy Horror) చేసుకుంది. పోర్న్‌ నటిని ఒక బ్యాంకు ఉద్యోగి దారుణంగా హత్య (Banker kills adult actress) చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి ముక్కలుగా నరికి చిన్న సంచుల్లో రోడ్డు పక్కన (chops off her body and dumps it on roadside) పడేశాడు. ఇటలీలోని లొంబార్డిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏండ్ల కరోల్ మాల్టేసి అలియాస్‌ చార్లెట్ ఏంజీ, కరోనాకు ముందు పెర్ఫ్యూమ్ షాపులో సేల్స్‌ అసిస్టెంట్‌గా పని చేసింది.

అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె పోర్న్‌ స్టార్‌ అయ్యింది. తాను నటించిన అశ్లీల చిత్రాలను తన ఫ్యాన్స్‌కు మాత్రమే పోస్ట్‌ చేసేది. కాగా, మార్చి 11-13 వరకు జరిగిన లక్సీ ఎరోటిక్ ఫెస్టివల్ 2లో కరోల్ ఒక ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ వేడుకకు ఆమె రాకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కనిపించక పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే లొంబార్డి ప్రాంతంలోని పల్లినే గ్రామ సమీపంలోని గుట్టల్లో ఒక మహిళ మృతదేహం భాగాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి ఆ భాగాలను పరిశీలించారు. మరణించిన మహిళ శరీర భాగాలు పోర్న్‌ నటి కరోల్ మాల్టేసివిగా ఒక అభిమాని గుర్తించాడు. ఆమెను సుత్తితో కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి ముక్కలుగా కోసి నాలుగు బ్యాగుల్లో ఉంచి పడేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలికపై 55 ఏళ్ళ వృద్ధుడి లైంగిక వేధింపులు, అతన్ని చంపి, ఆ శవాన్ని ముక్కలుగా నరికి నదిలో పారేసిన బాధితురాలి తండ్రి, మేనమామ, ఎంపీలో దారుణ ఘటన

కరోల్‌ హత్యకు సంబంధించి బ్యాంకులో పని చేసే 43 ఏండ్ల డేవిడ్ ఫోంటానాను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా జనవరిలోనే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని నెల పాటు ఫ్రిజర్‌లో ఉంచి అనంతరం ముక్కలుగా నరికి రోడ్డు పక్కగా పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అతడిపై హత్య, మృతదేహాన్ని దాచడం, ఆధారాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement