IPL Auction 2025 Live

Earthquake in Mexico: భారీ భూకంపానికి వణికిన మెక్సికో, 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలిపిన నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్, కొన్ని సెకన్ల పాటు కదిలిన భవనాలు

పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి (Strong Quake of Magnitude 7.0 Hits ) కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది.

Earthquake of Magnitude

Mexico City, September 8: మెక్సికోలో భారీ భూకంపం (Earthquake in Mexico) సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి (Strong Quake of Magnitude 7.0 Hits ) కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్ అవుతున్నాయి. రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.

వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు.

దేశంలో కొత్తగా 37,875 మందికి కరోనా, తాజాగా 369 మంది మృతి, దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్‌ పంపిణీ

కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్‌ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలుకోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017 లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు.