Hurricane Simon: గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న సైమన్ హరికేన్.. వణుకుతున్న మెక్సికో పసిఫిక్ తీర ప్రాంతాలు.. నాసా విడుదల చేసిన ఫోటోలివిగో..
గంటకు ఏకంగా 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వీచే అతి శక్తివంతమైన కేటగిరీ-4 తుఫానుగా బలపడిన 'సైమన్' హరికేన్, మెక్సికో పసిఫిక్ తీరానికి అత్యంత సమీపంగా కదులుతూ తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఈ విపరమైన తుఫాను ఉనికిని నాసా, NOAA ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి స్పష్టంగా రికార్డ్ చేశాయి.
Hurricane Simon: గంటకు ఏకంగా 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వీచే అతి శక్తివంతమైన కేటగిరీ-4 తుఫానుగా బలపడిన 'సైమన్' హరికేన్, మెక్సికో పసిఫిక్ తీరానికి అత్యంత సమీపంగా కదులుతూ తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఈ విపరమైన తుఫాను ఉనికిని నాసా, NOAA ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి స్పష్టంగా రికార్డ్ చేశాయి. ఈ హరికేన్ ప్రభావంతో మెక్సికోలోని తీర ప్రాంతాలు పర్వత భూభాగాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచం కోసమే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు.. డీజిల్ ఒప్పందంపై అమెరికాలో రాజకీయ దుమారం వేళ సమర్ధించుకున్న ట్రంప్..
అక్టోబర్ 11న మన్జానిల్లో , ప్యూర్టో వల్లార్టా నగరాల మధ్య తీరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రం ప్రయాణించిన సమయంలో, నాసాకు చెందిన 'సుయోమి NPP' ఉపగ్రహంలోని VIIRS పరికరం ఈ అద్భుతమైన , భయానక దృశ్యాన్ని బంధించింది. అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం (NHC) నివేదిక ప్రకారం, ఉపగ్రహం ఈ చిత్రాన్ని తీసే సమయానికే సైమన్ హరికేన్ నిరంతర గాలుల వేగం గంటకు 210 కిలోమీటర్లకు పైగా నమోదైంది. అయితే మెక్సికోలోని ఎత్తైన సియెర్రా మాడ్రే పర్వత ప్రాంతం ఈ తుఫాను గతిని కొంతవరకు అడ్డుకోవడంతో, దీని తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ తీరప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది.
ఈ తుఫాను కేవలం భూమి ఉపరితలాన్నే కాకుండా, వాతావరణం యొక్క ఎగువ పొరలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసినట్లు ఉపగ్రహ పరిశీలనలు స్పష్టం చేశాయి. అక్టోబర్ 11 రాత్రి సమయంలో 'NOAA-21' ఉపగ్రహం సేకరించిన చిత్రాలలో, తుఫాను కేంద్రం నుంచి వాతావరణ గురుత్వాకర్షణ తరంగాలు (Atmospheric Gravity Waves) సుదూర ప్రాంతాలకు ప్రసరిస్తున్నట్లు వెల్లడైంది.
ఎగువ వాతావరణంలోని వాయువుల మసక సహజ కాంతి (ఎయిర్గ్లో) మధ్య ఈ తరంగాలు సముద్రపు అలల వలె స్పష్టంగా కనువిందు చేశాయి. తుఫాను కంటి గోడ సమీపంలో నీటి ఆవిరి ఘనీభవించడం వల్ల విడుదలైన విపరీతమైన ఉష్ణోగ్రత, బలమైన ఉరుములతో కూడిన క్యుములోనింబస్ మేఘాలను సృష్టించి, ఈ తరాలను నేరుగా స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్ పొరల వరకు పంపినట్లు నాసా శాస్త్రవేత్తలు వివరించారు.
అక్టోబర్ 13 నాటికి కాస్త బలహీనపడిన సైమన్ తుఫాను కేటగిరీ-2 హరికేన్గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం దీని గరిష్ట నిరంతర గాలుల వేగం గంటకు సుమారు 175 కిలోమీటర్లుగా కొనసాగుతోంది. జలిస్కో రాష్ట్రంలోని కాబో కొరియెంటెస్కు పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను గమ్యస్థానం, తీవ్రతపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
రాబోయే రోజుల్లో ఇది ఉత్తర దిశగా కాలిఫోర్నియా గల్ఫ్ వైపు కదిలి, వారం చివర్లో సినలోవా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాను కదిలే వేగం అత్యంత మందగించడంతో భారీ వర్షపాతం ఎక్కువ సేపు కురిసే ప్రమాదం ఉందని, తద్వారా లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.