Model Body Found In Fridge: ఫ్రిడ్జ్‌లో దొరికిన మోడల్ శవం, రెండు నెలల ప్రెగ్నెంట్‌గా తేల్చిన పోలీసులు, కాళ్లు, చేతుల కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి దారుణంగా హత్య, పోస్టుమార్డంలో సంచలన నిజాలు

ఒక మోడల్‌ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. (Los Angeles model) ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్‌ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది.

Maleesa Mooney (PIC@ Instagram)

Los Angeles, OCT 28: ఒక మోడల్‌ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. (Los Angeles model) ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్‌ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 12న 31 ఏళ్ల మోడల్‌ మలీసా మూనీ, లాస్ ఏంజెల్స్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఫ్రిజ్‌లో శవమై కనిపించింది. డ్రగ్స్‌, మద్యం మత్తులో ఉన్న ఆమెను కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఫ్రిజ్‌లో కుక్కిన ఆ మోడల్‌ తల, ముఖం, వీపు, చేతిపై గాయాలున్నట్లు చెప్పారు.

 

చనిపోయే నాటికి ఆమె రెండు నెలల గర్భిణీగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పేర్కొన్నారు. కాగా, మరణించిన మోడల్‌ మలీసాకు చెందిన ఐక్లౌడ్‌లో ఆమె పరికరాలను ఎవరో వినియోగిస్తున్నట్లు సూచించిన హెచ్చరిక తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు ఆమె ఐఫోన్, మ్యాక్‌బుక్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. మరోవైపు మూనీ మరణించినప్పుడు అనుభవించిన బాధను తాను ఊహించలేనని ఆమె సోదరి, మోడల్‌ అయిన జోర్డిన్ పౌలిన్ ఆవేదన వ్యక్తం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement