Pakistan: నా భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా..కోపంతో భార్య లవర్ ముక్కు చెవులు కోసేసిన భర్త, బాధితుని పరిస్థితి విషమం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్ ముజఫర్‌ఘర్ గ్రామంలో ఘటన

దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Muzffarghar, July 25: దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు. కాగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. పైగా ఆమె ప్రియుడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు.అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. ప్రస్తుతం ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పాకిస్తాన్ లోని లాహోర్ నుండి 375 కిలోమీటర్ల దూరంలో ఉన్నముజఫర్‌ఘర్ (Muzffarghar ) గ్రామంలో ఈ సంఘటన గురువారం జరిగింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ముజఫరానగర్‌కు చెందిన అబ్దుల్‌ ఖయ్యూమ్‌ తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఇతడి భార్యకు మహ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యతో దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా వారిద్దరూ మాట వినలేదు. సంబంధం కొనసాగిస్తుండడంతో ఖయ్యూమ్‌ కత్తి తీసుకుని సహచరులతో అక్రమ్‌ వెంట పడ్డాడు.

వెంటాడిన అనారోగ్యం..కొడుకును కృష్ణా నదిలో తోసేసి ఆ తర్వాత భార్యతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జెన్‌కో ఉద్యోగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్గొండ పోలీసులు

నిర్జన ప్రదేశానికి అతనిని తీసుకెళ్ళాడు. అక్కడ కత్తితో అక్రమ్‌ ముక్కు, చెవులు, కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన అక్రమ్‌ వెంటనే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించిన వైద్యులు ఏం జరిగిందని వివరాలు ఆరా తీయగా పై విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తన నేరాన్ని అంగీకరించిన ఖయ్యూమ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. కాగా పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం "honour killing" పేరిట 1,000 మంది మహిళలు మరియు దాదాపు 600 నుండి 800 మంది పురుషులు చంపబడుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్‌ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

Suryapet Honour Killing Case: నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisement
Advertisement
Share Now
Advertisement