Hero Karizma XMR 210: ఇండియాలో లాంచ్ అయిన కరిజ్మా XMR 210 బైక్, ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయం

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మా XMR 210ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Hero Karizma XMR 210 (Photo-Hero Motocorp)

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మా XMR 210ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌కు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. బుకింగ్స్‌ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐకానిక్‌ ఎల్లో, టర్బో రెడ్‌, మ్యాటీ ఫాంటోమ్‌ బ్లాక్‌ రంగుల్లో బైక్ అందుబాటులో ఉంది.

ఇది 210 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4V, DOHC, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 9,250 ఆర్‌పీఎం వద్ద 25.5 పీఎస్‌ పవర్‌ను, 7,250 ఆర్‌పీఎం వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 143 kmphగా కంపెనీ పేర్కొంది. ఇందులో డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉన్నాయి.ఎల్‌ఈడీ లైట్స్‌, ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఇచ్చారు. హెడ్‌ల్యాంప్‌పైన మిర్రర్స్‌ ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు, గడ్కరీ లాంచ్ చేసిన బిఎస్6 హైబ్రిడ్ కారు ప్రత్యేకతలు ఇవిగో..

ఫుల్లీ డిజిటల్‌ ఇన్సుట్రుమెంటల్‌ క్లస్టర్‌ను ఇచ్చారు. ఇందులో గేర్‌ పొజిషన్ ఇండికేటర్‌, డేట్‌, టైమ్‌, ట్రిప్‌, ఓడోమీటర్ రీడింగ్‌, ఫ్యూయల్‌ లెవల్‌, టెకోమీటర్‌, స్పీడో మీటర్‌ రీడింగ్స్‌ వంటివి కనిపిస్తాయి. టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ సదుపాయం ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆప్షన్‌ ఉంది. దీంతో కాల్స్‌, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అలర్టులు కనిపిస్తాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement