పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు మార్కెట్లోకి వచ్చేసింది.కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని నేడు ఆవిష్కరించారు. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్‌లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది.
ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి.
Here's ANI Video
#WATCH | Delhi | Union Minister Nitin Gadkari unveiled the world's first prototype of the BS 6 Stage II ‘Electrified Flex Fuel Vehicle’ developed by Toyota Kirloskar Motor today. pic.twitter.com/XzmMbbO9T0
— ANI (@ANI) August 29, 2023
ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది.ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ వెహికల్ ఇది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా టయోటా ఇన్నోవా హైక్రాస్ ((Toyota Innova Highcross) రూపుదిద్దుకున్నది.
ఈ కారులో ఇథనాల్ ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.109 పలుకుతుండగా, లీటర్ ఇథనాల్ సుమారు రూ.60 మాత్రమే. అంటే పెట్రోల్ కంటే అత్యంత ఎకనామికల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు ఉండగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతున్నాయి కానీ ఇథనాల్ పంపులు ఎక్కడా లేవు. పెట్రోలియం కంపెనీలు ఇక నుంచి ఇథనాల్ పంపులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని నితిన్ గడ్కరీ కోరారు.
టయోటా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్లు తయారు చేస్తున్నాయి. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టయోటా మిరాయి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు ఆవిష్కరించారు. టయోటా మిరాయి కారు హైడ్రోజన్ పవర్డ్ కారు.