Festive Shopping Alert: పండగ వేళ వినియోగదారులకు షాక్.. అక్టోబర్ 1 నుండి భారీగా పెరగనున్న ఏసీలు, టీవీల ధరలు..
Festive Shopping Alert: దసరా, దీపావళి పండగల వేళ కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్య వినియోగదారులకు చేదు వార్త. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి
Festive Shopping Alert: దసరా, దీపావళి పండగల వేళ కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్య వినియోగదారులకు చేదు వార్త. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఉత్పత్తుల తయారీ వ్యయం పెరగడంతో వివిధ కంపెనీలు ధరలను 5 నుండి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. 2026 సంవత్సరంలో వినియోగదారులపై పడుతున్న మూడో విడత ధరల పెంపు ఇది కావడం గమనార్హం. బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా బ్యాంకుల సేవలు
ఈ ధరల పెంపులో ప్రధానంగా ఏసీలపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఏసీ ధరలు 5 నుండి 8 శాతం వరకు పెరగనుండగా, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 3 నుండి 4 శాతం వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
ముడిసరుకుల వ్యయం: ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కీలకమైన రాగి (Copper), అల్యూమినియం, ఉక్కు, ప్లాస్టిక్ మరియు క్రూడ్ డెరివేటివ్స్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి.
రవాణా & లాజిస్టిక్స్: గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు మరియు పశ్చిమాసియా సంక్షోభ పరిణామాల వల్ల అంతర్జాతీయ ఫ్రైట్ ఛార్జీలు, రవాణా వ్యయం గణనీయంగా పెరిగింది.
రూపాయి విలువ మారకం: కరెన్సీ విలువలో వస్తున్న వ్యత్యాసాలు విడిభాగాల దిగుమతి వ్యయాన్ని పెంచాయి.
బ్లూస్టార్, గోద్రెజ్ అప్లయన్సెస్, హయర్, దైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్, బాష్ హోమ్ కంఫర్ట్ (ఎల్జీ, హిటాచీ బ్రాండ్లు) వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఈ పెంపును ధ్రువీకరించాయి. ముడిసరుకుల వ్యయం పెరిగినందున ఏసీలు, డీప్ ఫ్రీజర్ల ధరలను పెంచక తప్పడం లేదని బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ స్పష్టం చేశారు.
అయితే, పండగ సీజన్ ప్రారంభంలోనే షాపింగ్ చేసే వారికి కొంత పాత స్టాక్ డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. డీలర్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే పాత ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న స్టాక్ అందుబాటులో ఉన్నంతవరకు పాత ధరలకే విక్రయించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారు ప్రారంభ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు