summer

Hyderabad, March 05: ఈ ఏడాది వేసవి పారంభంలోనే ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డ్‌ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు  (Temperatures Decrease) నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి అతలాకుతలమ‌వుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. రాబోయే 48 గంటలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో టెంపరేచర్‌ తక్కువ స్థాయిలో నమోదు అవుతుందన్నారు. తద్వారా రాత్రి ఉక్కపోత నుంచి ప్రజలు కాసా ఉపశమనం పొందుతారన్నారు.

Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు 

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నిజామబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేశారు.