Flight Offers: రూ. 6,714/- కే అంతర్జాతీయ విమాన ప్రయాణం. ఇండిగో ఎయిర్‌లైన్స్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థల నుంచి పోటాపోటీ ఆఫర్లు
గడువు లోపు టికెట్ బుకింగ్ చేసుకున్న వారు నవంబర్ 13, 2019 నుంచి ఏప్రిల్ 15, 2020 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణం షెడ్యూల్...
New Delhi, November 5: ప్రముఖ విమానయాన సేవల సంస్థ ఇండిగో (Indigo Airlines) తక్కువ ధరలోనే విదేశీ ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించిన తాజా ఆఫర్ కింద అన్ని టాక్సులు కలిపి రూ.8,490/- ప్రారంభ ధరతోనే కొన్ని నిర్ధేషించిన మార్గాలలో అంతర్జాతీయ ప్రయాణం (International Travel) చేయవచ్చునని వెల్లడించింది. అయితే పరిమిత కాలం వరకే ఈ ఆఫర్ ఉంటుంది. నవంబర్ 17లోపు టికెట్ బుకింగ్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. గడువు లోపు టికెట్ బుకింగ్ చేసుకున్న వారు నవంబర్ 13, 2019 నుంచి ఏప్రిల్ 15, 2020 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణం షెడ్యూల్ చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది.
ఈ ఆఫర్ కేవలం ఇండిగో లోని నాన్ స్టాప్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్ లకు మాత్రమే వర్తిస్తుంది. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత వేరే ప్రయాణానికి బదిలీ చేయబడదు మరియు రిఫండేబుల్ కాబడదు. అలాగే ఈ ఆఫర్‌ను మరేఇతర ఆఫర్, స్కీమ్ లేదా ప్రమోషన్‌తో కలపడానికి వీలు లేదని షరతులు విధించింది.
హైదరాబాద్, దిల్లీ, చైన్నై, కోల్ కతా మరియు ముంబై నుంచి కొలొంబో, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా తదితర రూట్లలో ఆఫర్ అందిస్తున్నట్లు ఇండిగో పేర్కొంది.
IndiGo Airlines Tweet:
ఇండిగోకి పోటీగా గోఎయిర్ (GoAir) విమానయాన సంస్థ కూడా ఆఫర్లను ప్రకటించింది. గోఎయిర్ 14వ వార్షికోత్సవం సందర్భంగా దేశీయంగా రూ 1,214 కు మరియు రూ. 6,714 ప్రారంభ ధరకే అంతర్జాతీయ విమాన టికెట్ ను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ నవంబర్ 06 లోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే, గడువులోపు బుక్ చేసుకున్నవారు నవంబర్ 13, 2019 నుంచి డిసెంబర్ 31, 2019 మధ్య కాలంలో ఎప్పుడైనా కొన్ని ఎంపిక చేయబడిన రూట్లలో ఆఫర్ ధరకు ప్రయాణిచవచ్చునని వెల్లడించింది.