
Newdelhi, Feb 24: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి (Newdelhi) వస్తోన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు (Flight Under Fighter Jet Escort) రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రోమ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపినట్టు పేర్కొంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం AA292 మొత్తం 199 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుంచి భారత్ రాజధాని న్యూఢిల్లీకి శనివారం బయలుదేరింది. మార్గమధ్యలో విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపులు రావడంతో ఇటలీ రాజధాని రోమ్ లోని లియోనార్డ్ డా విన్సీ రోమ్ ఫియుమిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేసినట్టు అధికారులు తెలిపారు. విమానం సురక్షితంగా రోమ్ లో దిగినట్టు ఏబీసీ న్యూస్ వివరించింది.
Here's Video:
న్యూఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఫైటర్‌జెట్ వెంటరాగా రోమ్కు మళ్లింపు
బాంబు బెదిరింపు రావడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్-న్యూదిల్లీ విమానాన్ని రోమ్కు మళ్లించారు. న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 8.14 గంటలకు విమానం బయల్దేరింది.… pic.twitter.com/VJMylXhZYf
— ChotaNews App (@ChotaNewsApp) February 24, 2025
యుద్ధ విమానాలు రక్షణగా
విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో రోమ్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరేందుకు ప్రోటోకాల్ ప్రకారం ఇటలీ రెండు యుద్ధ విమానాలను దానికి రక్షణగా పంపారు. అత్యవసర ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.