Bomb Threat Panic (Credits: X)

Chennai, Jan 26: చెన్నై ఎయిర్ పోర్టులో (Chennai Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని ఓ ప్రయాణీకుడు బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు ఈ విషయాన్ని చెన్నై ఎయిర్ పోర్టు భద్రతా అధికారులకు తెలియజేశారు. చెన్నై విమానాశ్రయంలో విమానం లాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేశారు.

అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో

Here's Video:

ఇద్దరి అరెస్ట్

ఆదివారం వేకువజామున ఐదు గంటల ప్రాంతానికి తనిఖీలు పూర్తి చేసిన భద్రత అధికారులు బాంబు లేదని తేల్చారు. కాగా, ప్రయాణీకులను భయాందోళనకు గురిచేసిన అమెరికా, కేరళ ప్రయాణీకులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్‌ చూశారా?