దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దిసోత్సవ వేడుకలు( 76th Republic Day) అంబరాన్నంటాయి. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు అద్భుతం చేశాడు. భారత దేశం(India Map) ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం చేయగా కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం ఆధ్వర్యంలో దేశ చిత్రపటం, సైనిక లోగో(military logo) ఆకట్టకుంటోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది. రంగురంగుల, వైవిధ్యభరితమైన ఈ డూడుల్ (Google Doodle) చూడటానికి ఎంతో చక్కగా ఉంది. ఈ డూడుల్ లో లడఖ్ ప్రాంత సాంప్రదాయ దుస్తులను ధరించిన మంచు చిరుత, సంగీత వాయిద్యం పట్టుకుని ధోతీ-కుర్తా ధరించిన పులి, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతిబింబించే పక్షులు, జంతువులు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ డూడుల్ నెట్టింట వైరల్ గా మారింది. నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా?
Amazing: India Map with 750 Students, video goes viral
అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుప్పం కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం ఆధ్వర్యంలో దేశ చిత్రపటం, సైనిక లోగో
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/6j9Ccjtdqj
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)