Google Doodle Republic Day 2025 (Credits: X)

Newdelhi, Jan 26: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది. రంగురంగుల, వైవిధ్యభరితమైన ఈ డూడుల్‌ (Google Doodle) చూడటానికి ఎంతో చక్కగా ఉంది. ఈ డూడుల్‌ లో లడఖ్ ప్రాంత సాంప్రదాయ దుస్తులను ధరించిన మంచు చిరుత, సంగీత వాయిద్యం పట్టుకుని ధోతీ-కుర్తా ధరించిన పులి, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతిబింబించే పక్షులు, జంతువులు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ డూడుల్ నెట్టింట వైరల్ గా మారింది.

రిపబ్లిక్ డే విషెస్ మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి.. Whatsapp, Twitter, Facebook ద్వారా ఈ విషెస్ షేర్ చేసుకోవచ్చు..  

ఢిల్లీ వేడుకలు ఎంతో ప్రత్యేకం

నేడు ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ కవాతు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది. రాజ్‌ పథ్ (ప్రస్తుతం ‘కర్తవ్య పథ్’గా పేరు మార్చబడింది) మీదుగా జరుగుతున్న ఈ కవాతులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల 16 శకటాలు, భారత సాయుధ దళాల ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. ఈ సంవత్సరానికి ప్రాజెక్ట్ చీతా, కునో నేషనల్ పార్క్ సంబంధించిన శకటాలు ప్రధాన ఆకర్షణగా  ఉంటాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!