
Hyderabad, Jan 26: గణతంత్ర దినోత్సవం (Republic day) నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad Traffic Alert) విధించారు. జనవరి 26న ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పరేడ్ మైదానం పరిసరాల్లో, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆంక్షలు ఇలా..
పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ మైదానం మార్గంలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలైన టివోల్ క్రాస్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించారు.