
Hyd, Feb 23: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది టన్నెల్‌లో చిక్కుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభించిన నాలుగో రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం(Rahul Gandhi On SLBC Tunnel Incident).
ప్రమాద ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఫోన్ చేసిన రాహుల్.. SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రక్షణ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలా స్పందించిందో వివరించారు. సమాచారం అందిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్‌ను సంఘటనా స్థలానికి పంపించి, #NRDF మరియు #SRDF సహాయ బృందాలను తక్షణమే రంగంలోకి దింపినట్లు వివరించారు.
గాయపడిన వారికి మెడికల్ సహాయ చర్యలు, అలాగే లోపల చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలకు తగినంత సహాయం అందించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాహుల్ గాంధీ అభినందిస్తూ, కార్మికులను రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ... ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రికి తెలియజేశారు.
SLBC Tunnel Incident, Rahul Gandhi Phone call to CM Revanth Reddy
Leader of the Opposition (LoP) in Lok Sabha and senior Congress leader Shri @RahulGandhi called and spoke to Chief Minister Shri A. Revanth Reddy today morning over the ongoing rescue operations at the SLBC tunnel.
In the nearly 20 minute update, Chief Minister illustrated the… pic.twitter.com/a0GI9S0HUZ
— Telangana CMO (@TelanganaCMO) February 23, 2025
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ .. ముఖ్యమంత్రికి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
SLBC Tunnel Drone Visuals
SLBC టన్నెల్ డ్రోన్ విజువల్స్ pic.twitter.com/kPekK2xypY
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025