Mobikwik Gold Offer: మొబిక్విక్ మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్, 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ మార్చుకుంటే ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ ఉచితం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆఫర్ వర్తింపు, పరిమిత కాలం మాత్రమే

దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

mobikwik-safe-gold-unveil-mega-exchange-offer-diwali-buy-one-get-one-gm-gold-mobikwik

Mumbai, October 25: దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలు కోసం 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ను మార్చుకుంటే వారికి ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ తిరిగి ఇస్తోంది. ఇందుకోసం ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌పామ్ 'సేఫ్‌గోల్డ్' సంస్థతో మొబీక్విక్‌ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. యూజర్లు ఇలా కొనుగోలు చేసిన బంగారం ‘సేఫ్‌గోల్డ్' అకౌంట్‌లో జమవుతుంది. కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 23 నుంచి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని మొబిక్విక్ ప్రకటించింది.

యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత మీకు వచ్చే 1 గ్రాము మొబీక్విక్ గోల్డ్ అకౌంట్‌కు వచ్చి యాడ్ అవుతుంది. మీరు మొబిక్విక్ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మళ్లీ ఫిజికల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుగోలుదారులు తమ ఇంటికి కూడా డెలివరీ చేయించుకోవచ్చు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు మాదిరిగానే ఇందులో తమ డెలివరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా కస్టమర్లనుంచి అధిక స్పందన వస్తుందని ఆశిస్తున్నామని మొబీక్విక్ సహ వ్యవస్థాపకుడు ఉపసానా టాకు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement