IPL Auction 2025 Live

RBI Repo Rate Hike: మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు

సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.

RBI (Credits: Twitter)

Hyderabad, April 4: ద్రవ్యోల్బణం పేరిట ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను (Interest Rates) పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank) మరో సారి అదే దారిలో సాగనున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ-MPC) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్‌ పాయింట్ల (Basic Points) (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గృహ, ఆటో రుణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే రెపో రేటును 2022 మే నుంచి మొదలుపెట్టి, ఇప్పటివరకూ 2.50 శాతం పెంచారు. ఈ పెంపు ప్రక్రియలో ఏప్రిల్‌ 6న పెరగబోయేదే చివరిది కావచ్చన్న ఆశాభావం పరిశ్రమ, మార్కెట్‌ వర్గాల్లో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజులపాటు సమావేశమై (ఏప్రిల్‌ 3,5,6) వివిధ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాల్ని, ధరల తీరును చర్చిస్తుంది.

Thanks Giving Assembly: నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయ మేధావుల ధన్యవాద సభ.. గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఢిల్లీ వసంత్‌ నేతృత్వంలో అట్టహాసంగా కార్యక్రమం

నిర్ణయాలు గురువారం వెల్లడి

దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 6.52 శాతం, ఫిబ్రవరిలో 6.44 శాతం చొప్పున నమోదయ్యింది. వివిధ కేంద్ర బ్యాంక్‌లు ఇటీవలి సమీక్షల్లో మరోసారి వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సైతం రెపో రేటును మరో పావుశాతం పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక పాలసీపై ఆరుగురు సభ్యులు కలిగిన కమిటీ తీసుకున్న నిర్ణయాలను గురువారం గవర్నర్‌ వెల్లడిస్తారు.

CSK vs LSG, IPL 2023: ఐపీఎల్ లో సంచలన విజయంతో చెన్నై బోణీ, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్‌ ఓటమిపాలైంది