
Newdelhi, Mar 1: మార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు (Gas Companies) బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై (Commercial LPG Cylinder Prices) రూ. 6 చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,803 రూపాయలకు పెరిగింది. కోల్ కతలో రూ. 1,913, ముంబైలో రూ. 1,755.50, చెన్నైలో రూ 1,965.50 కు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న ధర కొనసాగుతోంది.
Oil marketing companies have hiked commercial #LPG cylinder prices by Rs 6, effective March 1, 2025. The 19-kg cylinder now costs Rs 1,803 in Delhi, Rs 1,913 in Kolkata, Rs 1,755.50 in Mumbai, and Rs 1,965.50 in Chennai.
Know more: https://t.co/CRtUGJwFf5
— IndiaTV English (@indiatv) March 1, 2025
అందుకేనా?
జనవరి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్ పై రూ.14.50 మేర, ఫిబ్రవరిలో మరో రూ. 7 మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లు పెంచారు. జాతరలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిలిండర్ ధర పెరిగినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.