Rupee-Dollar Outlook: డాలర్ దెబ్బకు రూపాయి మళ్లీ 99కు పతనం.. సంచలన అంచనాను విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్.. కారణమేమిటంటే..

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Rupee falls all-time low of 85.24 against US dollar(X)

Rupee-Dollar Outlook: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి విలువ 97 స్థాయికి పడిపోవచ్చని, ఒకవేళ ఒత్తిడి కొనసాగి ఆ మార్కును కూడా దాటితే మరింత బలహీనపడి 98.5 నుండి 99 వరకు జారవచ్చని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ , కమోడిటీ విభాగం అధిపతి అనింద్య బానర్జీ అంచనా వేశారు. భారతదేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ముడి చమురు ధరల భారం , అమెరికా బాండ్ రాబడులు పెరగడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.  అక్టోబర్ 2026లో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు.. గాంధీ జయంతి, దసరా, దుర్గాపూజతో పూర్తి లిస్ట్ ఇదే..

ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుండి భారీగా నిధులను ఉపసంహరించుకుంటూ ఒక్క నెలలోనే సుమారు 6.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. గడిచిన రెండు నెలల్లో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులలో దాదాపు 90 శాతం నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. దీనికితోడు ముడి చమురు ధరలతో పాటు స్పాట్ క్రూడ్, రవాణా చార్జీలు , శుద్ధి చేసిన డీజిల్, విమాన ఇంధన ధరలు అధికంగా ఉండటం వల్ల దేశీయంగా దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలో 10 ఏళ్లు , అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన ప్రభుత్వ బాండ్ల రాబడులు గణనీయంగా పెరగడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు అమెరికా వైపు తరలివెళ్తున్నాయి.

ఇటీవల ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) విధానం ద్వారా భారత్‌కు వచ్చిన నిధులు నేరుగా మార్కెట్‌లోకి రాకుండా ఆర్‌బిఐ విదేశీ మారక నిల్వల్లోకి వెళ్లిపోవడంతో రూపాయికి తక్షణ లబ్ధి చేకూరలేదు. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ సానుకూల వాస్తవ వడ్డీ రేట్లను కాపాడేందుకు ఆర్‌బిఐ రాబోయే సమీక్షల్లో (బహుశా డిసెంబర్ నాటికి) ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement