Kushboo in Hospital: హాస్పిటల్ బెడ్‌ మీద కుష్భూ, ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా? ఆస్పత్రి బెడ్‌ మీద నుంచే సెల్ఫీ పోస్ట్ చేసిన అలనాటి హీరోయిన్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్స్

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో (Hospital) అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూకి.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాధించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినీ నటిగానే కాదు, రాజకీయవేత్తగా (Politician) కూడా ఆమె సేవలు అందిస్తూ వస్తుంది.

Credit @Kushboo Twitter

Chennai, OCT 07: అలనాటి స్టార్ హీరోయిన్ హీరోయిన్ కుష్బూ (Kushboo).. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో (Hospital) అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూ.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాదించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినీ నటిగానే కాదు, రాజకీయవేత్తగా (Politician) కూడా ఆమె సేవలు అందిస్తూ వస్తుంది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ మహిళా నేత కార్యదర్శిగా వ్యవహరిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమె వెన్నుముక సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ట్రీట్మెంట్ కోసం ఇటీవల హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఈ విషయాన్ని నటి కుష్బూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. “వెన్నుముక సమస్యతో ఆసుపత్రిలో చేరాను. ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తా, విధుల్లో పాలుపంచుకుంటా. అందరకి విజయదశమి శుభాకాంక్షలు” అంటూ హాస్పిటల్ లో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.

ఆ వార్త విన్న అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఖుష్బు సుందర్‌ సౌత్‌, నార్త్‌ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈమె శర్వానంద్‌ హీరోగా నటించిన ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక తల్లిగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తుంది.

AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..  

కేవలం నటిగానే కాకుండా నిర్మాతగాను పలు సినిమాలను రూపొందించి సక్సెస్ అయింది. ఇక ఈమె భర్త సుందర్‌.సి దర్శకత్వం వహించిన ‘కాఫీ విత్ కాదల్’ సినిమాను కూడా ఖుష్బూ నిర్మించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement